ఎటు పోదునురా రామా! స్వయముగ ||ఎటు||
ఎదుటన ఉన్నా వెదకెడి కనులతొ
ఎదలోనున్నా ఎరుగని తనువుతొ
||ఎటు||
పిలిచెడి నా ప్రతి పలుకులయున్నా
పలవరించెడి అలవాటు పోదే... ||2||
అలలసంత నా కలవరింతలను...|2|
జలధిశయన నీ జాడలు యుండగ
||ఎటు||
ఏ దారి కదిలిన నీదరికేగా
పదముల కైనా అదురుపాటులే.. ||2||
కుదురేలేని నా కదలికలోనా..|2|
కుదురుగ నీవే కూర్చొనియుండగ
||ఎటు||
No comments:
Post a Comment