శ్రీ చావా కిరణ్ గారు ఇచ్చిన సన్నివేశానికి (ఇక్కడ చూడండి) నాకు తోచిన పాట.
సడి.. చిరు సడి ..వినబడి
అదే పాటుగా .పాటగా ..నిలబడి.. వినబడి ||సడి||
గుండియలోన జారిన కన్నుల నీటి తడి
తుడిచిన చల్లని గాలి ఒడి ||సడి||
గగనపు గుడిలో మబ్బుల గడిలో
ఆడే గువ్వల సవ్వడులు
వడివడి అడుగుల జలతరంగముల
బేడిస గుంపుల సందడులు
వినువీధులలో విహరించేందుకు
విధి చేతలనే వివరించేందుకు
పదపడి రేపే తలపుల తాకిడి
సుడి.. అలజడి.. తొలగిడి
అదే పాటుగా .పాటగా ..నిలబడి.. వినబడి ||సడి||
కడిమి వనములో తడబడు నడకల
వెదుకులాడెనే అలికిడినో
నిబిడి శాంతిలో గుడిసె నీడలో
వెలువడే నదే తెలివిడియో
శిలశిల్పమ్మౌ ఇడుగడలెన్నో
కుడియెడమలలో యెడమెంతో
ప్రకృతి బడిలో నిశ్చల పోడిమి
ముడి .. విడివడి.. తనివిడి
అదే పాటుగా .పాటగా ..నిలబడి.. వినబడి ||సడి||
Subscribe to:
Posts (Atom)