Thursday, August 25, 2011

"ఉరుమి" చూసిన ఆ క్షణం !!

కదనం కదనం
ప్రతి చలనం సంచలనం
జననం మరణం
ఒక భ్రమణం విష వలయం                                    || కదనం కదనం ||

రణమే వజ్ర సంకల్పం
కణమే రుద్ర చైతన్యం
హృదిలో మౌన విస్ఫోటం
త్రుటిలో విశ్వ విధ్వంసం
నేత్రం.. భానుకోటి సదృశం
గాత్రం.. క్షాత్ర సుప్రతిష్టం
దగ్ధం వ్యర్ధం సిద్ధం యుద్ధం శుభ్రం.... సమస్తం             || కదనం కదనం ||

పదపద పదపద పదపద పదపద హోరెత్తిన యోద్ధుల ఘట్టన
సలసల సలసల సలసల సలసల పోటెత్తిన నెత్తుటి ఉప్పెన
ఫెళఫెళ ఫెళఫెళ ఫెళఫెళ ఫెళఫెళ పోరెత్తిన కత్తుల ఘర్షణ

" జయం! ... నిశ్చయం !!... శత్రుక్షయం !!! "
" జయం! ... నిశ్చయం !!... శత్రుక్షయం !!! "

నలుదిక్కులు పిక్కటిల్లే సంరావం
దివి చుక్కలు క్రిక్కిరయ్యే సంఘాతం
దగ్ధం వ్యర్ధం సిద్ధం యుద్ధం శుభ్రం.... సమస్తం              || కదనం కదనం ||

అనలం అనిలం సలిలం ఖతలం  నిలబడనీ ఇల.... సాక్షిగా
నరమో కరమో గళమో శిరమో తెగిపడనీ ఇల సాక్షిగా
ఇహమో పరమో జవమో బలమో గెలువగ .. నీ ఇల సాక్షిగా

స్వేదవర్షం .. రోమహర్షం.. ఉగ్రకర్షం !!!
స్వేదవర్షం .. రోమహర్షం.. ఉగ్రకర్షం !!!

ఖండ పరశు ఫాలేక్షణం
ఉరుమి చూసిన ఆ క్షణం .... ..... . . . . .  .  .     .      .       .