(ఐ.ఐ.ఎస్‌సి మెస్సులో వంకాయ అన్నంలో వచ్చిన బల్లిని చూసి వ్రాసినది)
ఏడి నూనేలోనా ఏగేగిపోనాది
ఎందుకొచ్చిందో ఏమో ఎర్రినా బల్లి ||2||
కడుపు చే బట్టుకొని కాళ్ళీడ్చుకొచ్చిందొ
కడివెడు కన్నీళ్ళూ కారగా వచ్చిందొ
కరువుగాలమొచ్చిందొ కరచు డొక్కయ్యిందొ
కూటికోసమొచ్చిందొ కూలిసేద్దమనుకొందొ
దొరలయిందుకొచ్చింది దోరగా ఏగింది
దూలతీరిపోనాది దొంగనా బల్లి ||2|| |ఏడి నూనే|
ఆశ కలిగిందేమో ఆ సిట్టి బొజ్జకి
కూసింత కూరముక్క కొరుకుదామనుకొందొ
తా సేయి సాచిందో దోసిలే పట్టిందో
ఇసుగొచ్చిందేమో కూసుని కూసుని
ఉష్..! ఉష్‌ష్! … ఉష్..! ఉష్‌ష్!
" ఉస్సుసని తోలి నా ఊసునే మరచేరు
ఈసుడా! నా బతుకు ఇలువేమిటయ్యా?! "
అడుగుదామనుకొందో అడుగంట కాలింది
పీడ ఇరగడైపోయే పిచ్చినా బల్లి ||2|| |ఏడి నూనే|