కూర్చునె యుంటిని రా నీకై
వేచియె యుంటిని రా!.......రామా.. ||కూర్చునె||
తోచెడి త్రోవలు తొంబది ఉన్నా |2|
గాచెడి నీకై కాపుగాసి నే... ||కూర్చునె||
విశ్వములో ఎటు వెదకినగానీ
శాశ్వతమైనది సాధ్యము కాదే
|2|
నశ్వరమైనవే నా అనుభూతులు
ఈశ్వర సత్యము ఎరుగలేని నే... ||కూర్చునె||
కుట్టవు చీమలు గువ్వలు ఎగరవు
చెట్టుల చేమల చిగురులు తొడగవు |2|
అట్టిది నీవే ఆనతి నీయక
పుట్టునా మనిషి పుర్రెకు
బుద్ధులు ||కూర్చునె||
పలుకులనైనా తలపులనైనా
ఇలలోనైనా నా కలలోనైనా
|2|
విలువెంత 'నా ' అను ఆలోచనల
అలుక చాలు నీ ఆటబొమ్మపై..... ||కూర్చునె||
శిక్షల మోసే శక్తియులేదు
లక్ష్యము చేరే దక్షతలేదు
|2|
మోక్షము తెలియని మొద్దును నేనని
ప్రేక్షక పాత్రను ప్రేమతొనీమని.. ||కూర్చునె||
No comments:
Post a Comment