తప్పొప్పులెందుకు
? తగవులాటెందుకు?
చప్పున
రాకుండ జాగేలనయ్యా?
కప్పిన
మాయలు కదలరాకున్నాయి
విప్పి
నీవే కను విప్పు నాకీవయ్యా || తప్పొప్పు||
అటు ఇటు
కదిలేటి అదుపులేని మనసు
ఎటు తిరిగి
మారదు ఎదురుచూపేలను
రాటు దేలినదీ
జగతి రంగులరాటను
దాటగ దీనిని
దారి నాకేదయ్య || తప్పొప్పు||
తెగులు
పట్టిన నాదు తెలివినేమందును
తగునని
తగదని తనకేదో తెలుసని
అగుపించి
దాగుచు అలజడి రేపుచు
ఎగురుచు
యున్నా తానెరుగలేదయ్యా || తప్పొప్పు||
ఉందను
ఆత్మ లోనున్నదో లేదో
అందులోనేముందొ
అంతు తెలియాకుంది
కుందనపూ
బొమ్మై కూర్చునే యుండును
విందు
చూచునొ ఏమో వారించబోదయ్యా || తప్పొప్పు||
No comments:
Post a Comment