తప్పులు చేయుదునేమో రామా
చప్పున రమ్మీ ఇటురమ్మీ
|| తప్పులు ||
ఎప్పటికప్పుడు ఎగురుచునేవో
తిప్పలు తెచ్చెడి తింగరి
మనసిది || తప్పులు ||
కచ్చిని రేపుచు కత్తులు
బల్లాల్
గుచ్చిన రీతిని కోరికలు
వచ్చునొ, పట్టునొ, ప్రాణము మీదికి
తెచ్చునొ యేమో తింగరి మనసిది
|| తప్పులు||
ఉక్కిరి బిక్కిరి ఉచ్చులు, కప్పల
తక్కెడ మేళపు తర్కములు
చక్కని మార్గము సాధన సేయగ
దిక్కేదయ్యో తింగరి మనసిది
|| తప్పులు ||
ఇట్టే స్వర్గము ఇలలో చూపును
ఉట్టిని చేరని ఊహలతో
కట్టి పడేసిన కలలమేడ లం -
దిట్టుల యున్నది తింగరి
మనసిది || తప్పులు||
No comments:
Post a Comment