నీ కోసమె యీ
జీవము ! నా గానము !
నీ కొలువున ఈయవా చిరు స్థానము !
|| నీ కోసమె||
ఈ జగతిన నా
పనేమిటి... శూన్యము
పాడు చున్నది
ఏవో పాటలు ప్రాణము
|| నీ కోసమె||
నిశను నీరవ
దేవాలయమున
ఆశ తీరగ
ఆనతీయుము ||2||
శాసింపుమా
పవళింపుసేవకు
ప్రభూ....! ప్రభూ... !
ప్రభూ....!
శ్వాస గానము
చేసి పాడెద ఒసగుమీ ఈ పుణ్యము !
|| నీ కోసమె||
వెలుగుతీగెల
పసిడి వీణియ
చలితమయ్యే
సుప్రభాతము ||2||
గాలి
గుసగుసలాడు వేళను
ప్రభూ....!
ప్రభూ... ! ప్రభూ....!
నిలుపు నీ
సాన్నిధ్యము కలుగనీ సమ్మానము !
|| నీ కోసమె||
No comments:
Post a Comment