గాలి కొరకు ఎదురు చూస్తే .. సుడిగాలి రేగింది
నీటి చుక్క వెతుకుతుంటే.. వరద ముంచి పోయింది ||గాలి||
ఎండమావులె ఆసరా, ఈ ఎడారి దారులా
సాగుతోంది నా పయనం, అంతులేని జీవనం
నీడ కొరకు విత్తునేస్తే... మరులుతీగ ప్రాకింది ||గాలి||
అందలేని ద్రాక్షకు ఎదురుచూపులుండునా
కంచికెళ్ళు కథలను ఆగమంటె ఆగునా
చిరునవ్వుకు ఆశపడితే.. నవ్వులపాలయ్యాను ||గాలి||
అమావాస్యరాతిరిలో అలముకున్న చీకటిలో
వెతుకుతుంటి నా గమ్యం వెతశరాల కౌగిటిలో
వెలుగుకొరకు ఎదురుచూస్తే.. నా.. చితిమంట ఎగసింది ||గాలి||
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
మీ ఆకాంక్ష చాలా బాగుంది!
Post a Comment