Saturday, September 11, 2010

గుండె బరువు

నిన్ను గుండెల్లో దాచాను...
గుండె పగిలింది..!

పగిలిన హృదయ శకలాల్లో...
నీ రూపం చూడాలని...
పిచ్చి ప్రయత్నం!!

ఒక్కో ముక్కా తీస్తున్నా..
తరచి తరచి చూస్తున్నా...
నీవు లేక విసిరేస్తున్నా..

మనసు... తరిగిపోతోంది..
బరువు... పెరిగిపోతోంది!!

నువ్వేమో కనిపించటంలేదు...
నే కూడా కనుమరుగవుతున్నాను!!

2 comments:

భాస్కర రామిరెడ్డి said...

ఆదిత్య గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు

హారం

lalitha said...

నిజమే సుమీ!!