Friday, April 23, 2010

ప్రకృతి

Nature's first green is gold,
Her hardest hue to hold.
Her early leaf's a flower;
But only so an hour.
Then leaf subsides to leaf.
So Eden sank to grief,
So dawn goes down to day.
Nothing gold can stay.
- Robert Frost

తే.గీ || ప్రకృతి తొలిహరితమ్ము అభ్రమపు మెఱుగు
చొచ్చువడెడి గాఢపుఛాయ చూపనపుడు
ఆమె కిసలయమ్మదికాదె అలరు మొదలు
అట్లరఘడియ వరకుండునంతె మిగులు

అంత పతనమ్ము పతనమై అణగిపోవు
నందనమ్మొక శోకమై నలిగిపోవు
అదలి ప్రత్యూష మెటొబోవు అహము వచ్చు
సిరి యనునదేది మనలేదు చివరివరకు!

6 comments:

కొత్త పాళీ said...

సెబాస్సెబాస్సెబాసో .. అద్భుతంగా వచ్చింది అనువాదం. ఎంత చక్కటి నుడికారం. మీ అక్షరాల పసిడి మాత్రం తప్పక నిలుస్తుంది :)

Sandeep P said...

చాలా చక్కని అనువాదమండి! మీరు ఇంకా ఎన్నో మంచి పద్యాలు వ్రాయలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

.C said...

సంక్షిప్తత కోల్పోకుండా, భావసౌందర్యం చెడకుండా చక్కగా అనువదించారు. ముందు ముందు మఱిన్ని చదవగలిగితే బాగుంటుదని నా ఆశ. మంచి పద్యాలని, కవిని పరిచయం చేసిన కొత్తపాళీ గారికి నెనర్లు.

రవి said...

చక్కగా అనువదించారు. ఇలానే ముందుకు సాగిపొండి. అభినందనలు.

దైవానిక said...

చాలా బాగుంది.

రాఘవ said...

అసలుకు సరిగా ఉండి, పద్యాలు చాల బాగున్నాయండీ.